నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించిన శ్రీలంక బుద్ధ సేన రిలీజియస్, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హిణిడుమ సునీల్ సేన్వి, ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచంలో శాంతి స్థాపన అత్యంత కీలకమని శనివారం అన్నారు. భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణలో బుద్ధిష్టు మాన్యుమెంట్స్, బుద్ధవనం ప్రాజెక్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆయన పేర్కొన్నారు.