నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం రంగుండ్ల గ్రామ శివారులో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది పేకాట ఆడుతున్నట్లు గుర్తించగా, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పోలీసులను చూసి పరారయ్యారు. పట్టుబడ్డ నలుగురి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధినం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేశారు.