రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, బుద్ధవనాన్ని విశ్వశాంతి కేంద్రంగా తీర్చిదిద్దుతామని, కళారూపాలు, వివిధ మాధ్యమాల ద్వారా బుద్ధుని బోధనలను గ్రామ గ్రామానికి తీసుకెళ్తామని తెలిపారు. సోమవారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధ వనంలో మూడవ బుద్ధ ధమ్మ యాత్ర ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన, వివిధ దేశాల నుండి హాజరైన బౌద్ధ బిక్షువులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తెలంగాణ బుద్ధుని ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుందని అన్నారు.