పై వంతెన ఏర్పాటు చేయాలి: సర్పంచ్ మచ్చ జయసుధ

నకిరేకల్ నియోజకవర్గం నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లికి వెళ్లే మార్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు చాలాసార్లు రైల్వే గేటు పడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అని సర్పంచ్ మచ్చ జయసుధ అన్నారు. అత్యవసర సమయంలో గేటువద్ద చిక్కుకోవాల్సి వస్తోందని ఈ మార్గానికి బదులుగా ప్రత్యామ్నాయంగా గోపలాయపల్లి గుట్ట స్వాగత ద్వారం గుండా వెళితే దూరం పెరుగుతోందని ఉన్నతాధికారులు స్పందించి గ్రామానికి వచ్చే ప్రధాన మార్గంలో పైవంతెన ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕