చిట్యాల మండల కేంద్రంలో సోమవారం జరిగిన రైతు సంఘం మండల మహాసభలో తెలంగాణ రైతు సంఘం చిట్యాల మండల నూతన అధ్యక్ష, కార్యదర్శిలుగా బొబ్బిలి సుధాకర్ రెడ్డి, అరూరి శ్రీను లు ఎన్నిక ఐనట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సంఘం ఉపాధ్యక్షులుగా లడే రాములు, సుర్కంటి మోహన్ రెడ్డి, సహాయ కార్యదర్శిలుగా మెట్టు నర్సింహా, ఉయ్యాల సత్తయ్య, కోశాధికారిగా రూపని ఇద్దయ్య లతో పాటు మరో పది మంది కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు.