నేరడ ప్రాధమిక పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు

చిట్యాల మండలంలోని నేరడ ప్రాధమిక పాఠశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి.  ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాఠశాల ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరించి సంక్రాంతి శోభను పెంచారు. పండుగలు భారతీయ సంస్కృతికి ప్రతీకలని, ఐక్యతను పెంపొందిస్తాయని పాఠశాల ప్రధానోపాద్యాయుడు  తెలిపారు. విద్యార్థులు కుటుంబంతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్