నల్గొండ జిల్లా చిట్యాల మండల జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నేరడ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా వెనకనుండి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.