కాంగ్రెస్ నాయకుడు అంజయ్య అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ జడ్పిటిసి

కట్టంగూర్ మండలం యరసానిగూడెం గ్రామానికి చెందిన వస్తుప్పల అంజయ్య మృతి చెందారు. ఆయన మృతదేహానికి కట్టంగూర్ మాజీ జడ్పిటిసి మాద యాదగిరి పూలమాల వేసి గురువారం నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకరబోయిన వెంకన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారు కృష్ణ, వెంకన్న, ఇస్మాయిల్‌పల్లి గ్రామ సర్పంచ్ మాద సైదులు, యరసానిగూడెం కాంగ్రెస్ నాయకులు కొరివి సంతోష్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ఉబ్బని మహేష్, బొందు  , రాజు, నవీన్, యాదగిరి, రమేష్, సురేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్