తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని ఊట్కూరు గ్రామంలో మంగళవారం సాయంత్రం తాటిచెట్టు దిగుతుండగా మోకు జారి కిందపడి గీత కార్మికుడు భూపతి వెంకటయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన రెండు కాళ్లు విరిగాయి. తోటి కార్మికులు ఆయనను 108 అంబులెన్స్‌లో నకిరేకల్ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్