ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో మంగళవారం బోగారం గ్రామానికి చెందిన కూనూరు సాయికుమార్‌తో పాటు 50 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. వీరికి లింగయ్య గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బోగారం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా కూనూరు సాయికుమార్ గౌడ్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటును అభ్యర్థించాలని, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్