ఎడమ, కుడి కాల్వ ద్వారా సాగు నీటి విడుదల

కేతపల్లి మండలం మూసీ ప్రాజెక్టు వద్ద ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి ఎడమ, కుడి కాల్వల ద్వారా సాగునీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లలో పేద ప్రజలకు ఇళ్లు, రేషన్ కార్డులు అందకుండా అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతుల ఇబ్బందులను తొలగించి, సమయానికి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్