ఓపీఎం మాదకద్రవ్యాన్ని విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

నల్గొండ డీఎస్పీ కే శివరాం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, జాతీయ రహదారి 65 పై ఉన్న డూన్ పంజాబీ దాబా యజమాని గుర్నిత్ సింగ్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ కు చెందినవాడు, లారీ డ్రైవర్లకు అక్రమంగా ఓపీఎం పాపి హస్క్ అనే మాదకద్రవ్యాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం అందింది. ఈ నేపథ్యంలో, శుక్రవారం రాత్రి చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ తన సిబ్బందితో కలిసి దాబాపై దాడి చేసి, యజమాని గుర్నిత్ సింగ్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై శనివారం చిట్యాల సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్