నకిరేకల్ పుర పరిధిలోని ఆఫీసర్స్ కాలనీలో శుక్రవారం తాళం వేసి ఉన్న ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు సైదులు ఇంట్లోని రిఫ్రిజిరేటర్ నుంచి మంటలు వ్యాపించి గృహోపకరణాలు, దుస్తులు దగ్ధమయ్యాయి. షాట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారి సాయిదీపక్ తెలిపారు. ఈ ఘటనలో రూ.3 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.