నకిరేకల్ పట్టణ శివారులోని హైదారాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కూలి పనులకు వెళ్లిన ముగ్గురు మహిళలు పని ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నీలమ్మ అనే మహిళ మృతి చెందగా,ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం కామినేని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.