నల్గొండ: ఘోరం.. భార్యను హతమార్చిన భర్త

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని భార్యను భర్త హత మార్చిన ఘటన మంగళవారం జరిగింది. బంధువుల వివరాల ప్రకారం మండలంలోని మామిడాలకు చెందిన కోదాటి శ్రీను నాలుగేళ్ల క్రితం వాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం విషయంపై అడిగింది. దీంతో వాణిని భర్త కత్తితో నరికి హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్