నల్గొండ: ఫలితాలు వచ్చిన రోజే మృత్యుఒడిలోకి

నకిరేకల్ మండలం మార్రూరులో బుధవారం ట్రాక్టర్ కింద పడి మన్నెం జశ్వంత్(15) మృతి చెందాడు. ఈరోజు వెలువడిన పదో తరగతి ఫలితాల్లో జశ్వంత్ 600కు గాను 470 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. పరీక్షల్లో పాసైన విషయం తెలియకుండానే బాలుడు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సంబంధిత పోస్ట్