నార్కెట్‌పల్లి: ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వీరేశం

నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పబ్బతిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ చిరుమర్తి ధర్మయ్య, బొడిగె నరసింహ, బొడిగె స్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్