నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. రామన్నపేట మండలంలోని సర్నేనిగూడెం గ్రామ పంచాయతీ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నీల వెంకటేష్‌ను ప్రకటించి, పార్టీ కండువా కప్పి అభినందనలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు సమిష్టిగా పనిచేసి సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన సూచించారు.