గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా గ్రామస్తులు సహకరించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ సూచించారు. నార్కట్ పల్లి, యల్లారెడ్డి గూడెం గ్రామ ప్రజలతో అవగాహన కార్యక్రమం నిర్వహించి, ఎన్నికల నియమాలు పాటించాలని ఆయన కోరారు.