మద్యం దుకాణాలలో కల్లుగీత సొసైటీలకు రిజర్వేషన్లు కల్పించాలి

రాష్ట్రంలో ప్రభుత్వం మంజూరు చేసే మద్యం షాపులలో కల్లుగీత సొసైటీలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చేగోని సీతారాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలలో జరిగిన గీత కార్మిక సంఘం 4వ మండలం మహాసభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మద్యం దుకాణాలలో కల్లుగీత సొసైటీలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక విస్మరించిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్