కట్టంగూర్ మండలం యరసానిగూడం గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ ఆకిటి శంకర్ ముదిరాజ్ ప్రారంభించారు. 0-5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని, ఈ మహమ్మారిని అంతమొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం కీలకమని ఆయన అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో చుక్కలు వేయించుకున్న వారిని గుర్తించి, 29, 30 తేదీల్లో ఇంటింటికి తిరిగి చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ కాసర్ల నవనీత, ఆశా కార్యకర్త ధనమ్మ పాల్గొన్నారు.