నార్కట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ, మాజీ సర్పంచ్ దూదిమెట్ల సత్తయ్య యాదవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, సోమవారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు చిరుమర్తి లింగయ్య గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా నార్కట్‌పల్లి మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా దూదిమెట్ల సత్తయ్య అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు.