ఆస్తి కోసం తల్లి అంత్యక్రియలను కొడుకు ఆపేసిన ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్‌లో సోమవారం చోటు చేసుకుంది. గుత్తా సక్కుబాయికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమార్తె పెళ్లికి 1.2 ఎకరాల భూమిని కట్నం కింద ఇచ్చింది. అయితే తనకు తెలియకుండా ఆ భూమిని తమ్ముడు తన భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దీంతో పెద్ద కొడుకు అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించాడు. ఎంత మంది చెప్పినా వినకపోవడంతో తల్లి శవం అనాథగా ఇంట్లో ఉంది.