మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రాధ్యానత ఇస్తున్నది

రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ తెలిపారు. బుధవారం ఆయన చిట్యాల మండలం, చిన్నకాపర్తి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, జల శక్తి అభియాన్ జనసంచాయ్–జన్ భాగీదారి కార్యక్రమాలను పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడి, పనులు, వేతనాలు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఉదయం 7 గంటల నుంచి పనులు చేస్తున్నామని, రోజుకు సుమారు రూ. 300 వరకు కూలి అందుతోందని మహిళా కూలీలు తెలిపారు.

సంబంధిత పోస్ట్