గ్రామ సర్పంచ్ కు వినతి పత్రం అందజేత

వెలిమినేడు గ్రామంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వెలిమినేడులో నిర్మించే రెడీమిక్స్ ప్లాంట్ ఆపాలని డివైఎఫ్ఐ మండల ప్రధాన కార్యదర్శి కూనూరు గణేష్ గ్రామ సర్పంచ్ బొంతల చంద్ర రెడ్డికి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ ప్లాంట్ నిర్మాణం వల్ల దాని నుంచి వచ్చే దుమ్ము దూళి సమీప ప్రాంతాలోని పంట పొలాలకు నష్టం వాటిల్లుతుందని, ప్రజలు శ్వాస సంబంధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అన్నారు. కావున ప్లాంట్ నిర్మాణాన్ని ఆపాలని లేనియెడల ఆందోళన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు ఏ. ప్రణీత్, డివైఎఫ్ఐ మండల సహాయ కార్యదర్శి జి. సాయిరాం, మండల ఉపాధ్యక్షుడు జి. సాయికిరణ్, శివశంకర్ జి. అరుణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕