చిట్యాల కనకదుర్గ అమ్మవారి ఆలయ 23వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ

నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ 23వ వార్షికోత్సవ మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ బొబ్బలి పాండు రెడ్డి, డాక్టర్ మూడ సుదర్శన్, పోలా బాషయ్య, దేవరపల్లి భగవంత రెడ్డి, కీర్తిశేషులు వేలుపల్లి సుదర్శన్, కీర్తిశేషులు యాస మల్లారెడ్డి, మూడ వెంకటాద్రి, బొబ్బలి శివశంకర్ రెడ్డి, పోల నవీన్ కుమార్ కమిటీ సభ్యులుగా ఉండి ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేసి నేటికీ 23 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యుల తరఫున నూతన పట్టు వస్త్రాలు, వడి బియ్యం కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి సమర్పించడం జరిగింది.

సంబంధిత పోస్ట్