నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని నేరడ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థినిలు ఆదర్శంగా నిలిచారు. తమ స్నేహితురాలు మహేశ్వరి తండ్రి వడ్డేపల్లి సైదులు ఇటీవల మృతిచెందిన విషయం తెలిసి, ఆమె కుటుంబానికి సహాయం చేయాలని వారు నిర్ణయించారు. ఈ క్రమంలో తామే స్వయంగా పొదుపు చేసిన డబ్బులతో 15 కేజీల నూనె, 25 కేజీల బియ్యం కొని ఆదివారం మహేశ్వరి కుటుంబానికి అందజేశారు.