నకిరేకల్: పట్టణంలోని వీటి కాలనీలో శనివారం పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని నిర్బంధించి ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఇంట్లో గదులు అద్దెకున్నాయా అంటూ లోపలికి ప్రవేశించిన ఇద్దరు దుండగులు మంచినీళ్లు అడిగి ఇంట్లోకి వెళ్ళగానే ఆమెను అనుసరించి గదిలో బంధించి తీవ్రంగా కొట్టి గొలుసు లాక్కెళ్ళినట్లు బాధితురాలు లక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.