హైవేపై ర్యాలీగా కొనసాగుతున్న రద్దీ

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వాహనాల రద్దీ కొనసాగుతోంది. నల్లగొండ జిల్లా చిట్యాల సమీపంలో వాహనాలు చీమలదండులా కదులుతున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. శనివారం అర్ధరాత్రి వరకు రెండు రోజుల్లో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపుకు లక్షా 13,553 వాహనాలు వెళ్లాయని అధికారులు తెలిపారు. చౌటుప్పల్, పంతంగి, చిట్యాల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. పెద్దకాపర్తి, చిట్యాల వద్ద జరుగుతున్న రోడ్డు పనుల కారణంగా హైవేపై వాహనాలు నెమ్మదిగా కదలాల్సి వస్తోంది.

సంబంధిత పోస్ట్