నీట్ పరీక్షకు 2038 విద్యార్థులు హాజరు అవుతున్నారు

ఈ సంవత్సరం మే 3న నల్గొండ జిల్లాలో నీట్ పరీక్ష జరగనుంది. మహాత్మ గాంధీ యూనివర్సిటీ, NG కాలేజీ, ఉమెన్స్ డిగ్రీ కాలేజీలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు 2038 మంది విద్యార్థులు హాజరు కానున్నారని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన తన చాంబర్‌లో అధికారులతో నీట్ ప్రవేశ పరీక్షపై సమీక్ష నిర్వహించారు. పరీక్షల సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు పాటించాల్సిన సూచనలను ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్