తుపానుతో రోడ్లకు 225 కోట్లు నష్టం

మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలో 334 ప్రాంతాల్లో రోడ్లకు 230 కిలోమీటర్ల మేర నష్టం వాటిల్లిందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. దెబ్బతిన్న, కోతకు గురైన రోడ్లు, వంతెనలు, కాజ్‌వేల తాత్కాలిక మరమ్మతులకు రూ. 7 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ. 225 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. భారీ వర్షాలతో రాష్ట్రంలో జరిగిన నష్టంపై గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కోమటిరెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్