4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలి

కేంద్ర ప్రభుత్వం నేటి నుండి అమలు చేయబోతున్న నూతన 4 లేబర్ కోడ్లు కార్మిక వర్గంపై తీవ్రమైన దాడి అని, ఇది చట్టాల మార్పు కాదని, కార్మిక హక్కుల అపహరణ అని ఐక్య కార్మిక సంఘాలు ఆరోపించాయి. దీనిని వ్యతిరేకిస్తూ జాతీయ పిలుపులో భాగంగా నల్లగొండ సుభాష్ విగ్రహం వద్ద బ్లాక్ డే గా పాటిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, సీఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరా రెడ్డి మాట్లాడుతూ కార్మిక హక్కులను రక్షించుకోవడం కోసం ప్రతి కార్మికుడు ఈ పోరాటంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్