రిజర్వేషన్ కల్పించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలి

బీసీ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేశ్, ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రవేశ పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బీసీ సంక్షేమ శాఖలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాల్లో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 30 ఏళ్లు పని చేసినా బీసీ ఉద్యోగులు ఎలాంటి ప్రమోషన్ లేకుండానే ఉద్యోగ విరమణ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్