ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్లు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గంగసాని సాయి సందీప్ (తండ్రి పేరు సుబ్బారావు) మృతి చెందారు. సుమారు ఉదయం 6 గంటల సమయంలో, నరసరావుపేట నుండి హైదరాబాద్‌కు టీఎస్ 07 జీజే 8693 కారులో వెళుతుండగా, ఆగి ఉన్న లారీని వెనుక భాగం నుండి ఢీకొనడంతో సందీప్ అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్