ఐక్యత కోసం కృషి చేసిన గొప్ప దేశభక్తుడు

దేశ సమగ్రత, ఐక్యత కోసం కృషి చేసిన గొప్ప దేశభక్తుడు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ అని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పటేల్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా 2కె రన్ను ఆయన జండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్ర పోరాటంలో శీలక పాత్ర పోషించి, 550 కి పైగా సంస్థానాలను భారత దేశంలో విలీనం చేసేందుకు దృఢ సంకల్పంతో ఎలాంటి వత్తిడికి లొంగకుండా కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి అని అన్నారు.

సంబంధిత పోస్ట్