ఆపదలో స్నేహితుడికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు

నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం అమ్మనబోలు ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు తమ మిత్రుడు బాసాని హరీష్‌కి అండగా నిలిచారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన హరీష్ భార్య కీర్తికి, ఆమె 50 రోజుల పసిపాపకు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, స్నేహితులంతా కలిసి లక్ష రూపాయలు పోగుచేసి ఆ మొత్తాన్ని ఆ పాప పేరు మీద పోస్ట్ ఆఫీస్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. కష్టకాలంలో తోటి మిత్రుడికి, అతని కుటుంబానికి అండగా నిలిచిన ఈ యువకుల మానవత్వం, స్నేహబంధం అందరినీ ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్