నల్లగొండ: డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026 జూన్‌లో నిర్వహించిన యూజీ సీబీసీఎస్ 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. నల్లగొండ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు. విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిషన్ నంబర్, సెమిస్టర్ వివరాలు నమోదు చేసి ఫలితాలను, మార్కుల వివరాలను ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చని సూచించారు.