నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చేపట్టిన ఔట్‌సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ జరిపించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డిని వర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు కోరారు. శుక్రవారం వర్సిటీ బీఆర్ఎస్‌వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. రోస్టర్ రిజర్వేషన్ విధానం పాటించకుండా, సరైన పత్రిక ప్రకటనలు ఇవ్వకుండా, అర్హులైన నిరుద్యోగులకు అవకాశం లేకుండా నియామకాలు చేపట్టినట్లు వారు ఆరోపించారు.