నల్లగొండ జిల్లా పోలీసు శాఖలో పరిపాలనా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడం, కేసుల దర్యాప్తును వేగవంతం చేయడం, రికార్డుల నిర్వహణను పటిష్టంగా ఉంచే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ మంగళవారం మిర్యాలగూడ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని గ్రేవ్ కేసుల క్రైమ్ ఫైల్స్, పెండింగ్ కేసుల రికార్డులు, ఇతర కేసులకు సంబంధించిన దర్యాప్తు పత్రాలను సవివరంగా పరిశీలించారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా కేసుల దర్యాప్తును నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.