మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నల్గొండలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నల్గొండ అంజి ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల ఎదుట సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.