బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ పై నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం జరిగిన హనుమాన్ జయంతి రోజు ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించే సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ప్రవీణ్ పై కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. ఓవైసీ బ్రదర్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.