గొలుసు దొంగతనం విఫలం, దుండగులు పరార్

దామరచర్ల మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఇంటి ఎదుట ఉన్న పడిగపాటి నారాయణమ్మ మెడలోని నాలుగున్నర తులాల బంగారు గొలుసును లాగేందుకు ప్రయత్నించారు. బాధితురాలు అప్రమత్తమై కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. తెగిన గొలుసు ఆమె చేతికే దక్కింది. సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్