నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత శనివారం నల్లగొండ పట్టణంలోని యాదవ సంఘం భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి, దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న అక్కసుతోనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చిందని ఆయన ఆరోపించారు.