నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సౌండ్ సోషల్ సైన్సెస్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ మరియు రెండు ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులు మరియు అధ్యాపకులు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె అరుణప్రియ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పై అవగాహనతో పాటు స్వీయ బాధ్యతను గుర్తించేలా ప్రతి వారం విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.