హైదరాబాద్ మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలతో మూసీ నది కాలుష్య కాసారంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలుష్యం నల్గొండ జిల్లాకు చేరుకొని, అక్కడ పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుడుతున్నారని, తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని అన్నారు. నల్గొండ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మూసీ ప్రక్షాళన ప్రభుత్వ నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు.