హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్ల నిర్మాణ పనులకు ఆదివారం నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మ.3.30 గం.కు నల్గొండ జిల్లాలోని కనగల్ మార్కెట్ యార్డుకు చేరుకుని అక్కడే హ్యామ్ రోడ్ల పనుల పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. నల్గొండ కార్పొరేషన్‌లో తొలిదశ తాగునీటి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన అనంతరం నల్గొండ నాగార్జున డిగ్రీ కాలేజీలో నిర్వహించే సభకు సీఎం హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.13 వేల కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు.