దివ్యాంగులు, వృద్ధుల కోసం కలెక్టర్ ప్రత్యేక ప్రజావాణి ప్రారంభం

నల్లగొండ జిల్లా యంత్రాంగం దివ్యాంగులు, వృద్ధుల సమస్యల పరిష్కారానికి నూతన శ్రీకారం చుట్టింది. ప్రతి నెలా చివరి శనివారం వీరి కోసమే ప్రత్యేక ‘ప్రజావాణి’ని కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. సాధారణ రోజుల్లో రద్దీ కారణంగా వీరు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. బాధితులు కేవలం అర్జీలు స్వీకరించడమే కాకుండా, అక్కడికక్కడే పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్