నల్గొండ జిల్లా కేంద్రంలో శనివారం చాకలి ఐలమ్మ 131వ జయంతిని పురస్కరించుకొని, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1895లో వరంగల్ జిల్లా కిష్టాపురంలో జన్మించిన చాకలి ఐలమ్మ, పేదల భూమి కోసం, సమానత్వం కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. అప్పటి దేశ్ ముఖ్ లకు ఎదురొడ్డి నిలిచిన వీరవనితగా, దొరల గడీలను తెంచుకొని పోరాడిన యోధురాలిగా ఆమెను స్మరించుకున్నారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటికీ ఆదర్శనీయమని తెలిపారు.