ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మంగళవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని, లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవడానికి ఇష్టపడకపోతే వారం రోజుల్లో సమ్మతి లేఖలు తీసుకుని, అవసరమైతే వాటిని రద్దు చేయాలని సూచించారు. ఈ సమీక్షలో ఆర్డీవోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్