ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుని పరామర్శ

నల్గొండ జిల్లా, కనగల్ మండలం బచ్చన్న గూడెం పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు కొప్పుల సైదులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశాల మేరకు గురువారం ఆయన వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి సైదులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్